MLG: వెంకటాపూర్ మండల కేంద్రంలో MGNREGS రూ.10 లక్షలతో నిర్మించనున్న మహిళా సమాఖ్య భవన నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరాలుగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంపద రావు, గ్రామ సర్పంచ్ సుగుణ-స్వామి ఉన్నారు.