కోనసీమ: అమలాపురం సబ్ డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నట్లు DSP TSRK ప్రసాద్ తెలిపారు. టౌన్,రూరల్, అల్లవరం, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన పరిధిలో ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.