సత్యసాయి: ధర్మవరం సబ్-డివిజన్ పరిధిలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎస్. సతీష్ కుమార్ అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ధర్మవరం వన్ టౌన్, టూ టౌన్, ముదిగుబ్బ, రూరల్ పోలీస్ స్టేషన్లలో రాత్రి పహారా, సిబ్బంది అప్రమత్తతను స్వయంగా పరిశీలించారు. గస్తీ ముమ్మరం చేయాలని, అనుమానితులపై నిఘా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.