JN: జఫర్‌గఢ్ మండలం గర్మిల్లపల్లి గ్రామ శివారులో వరంగల్‌కు చెందిన కట్కూరి స్వప్నరాజు దంపతుల మధ్య శుక్రవారం వివాదం చోటుచేసుకుంది. జఫర్‌గఢ్ హాస్టల్లో ఉన్న కుమార్తెను కలిసేందుకు బైక్ పై వెళ్తున్న సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. వివాదం ముదిరి భర్త భార్యపై కత్తితో దాడి చేయడంతో ఆమె గాయపడింది. చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.