ప్రకాశం: కనిగిరి టీడీపీ కార్యాలయంలో శనివారం జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి భారీగా తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు రోగులకు సమగ్రంగా పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు అందించారు.