NRPT: మద్దూర్ మున్సిపాలిటీ రెనివట్ల 10వ వార్డులో గురువారం “99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రజల గడప దాకా సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. నీరు, రోడ్లు, శానిటేషన్ అంశాలపై వినిపించిన అభ్యర్థనలను నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బంగారు గోవింద్, అధికారులు పవన్ పాల్గొన్నారు.