W.G: సోషల్ మీడియాలో జనసేన పార్టీపై జరుగుతున్న అసత్య ప్రచారాలను అడ్డుకోవాలని కోరుతూ ఆ పార్టీ నేతలు బుధవారం పోలీసులను ఆశ్రయించారు. నడిరోడ్డుపై ఒక యువకుడు వీరంగం చేస్తున్న వీడియోను పోస్ట్ చేసి, అతడిని నరసాపురం జనసేన వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా పేర్కొనడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుష్ప్రచారానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.