PDPL: పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పోత్కపల్లికి చెందిన గంగాపురి గంగమ్మ (80) కు క్లిష్టమైన తుంటి ఎముక ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. ఆర్థో సర్జన్ డాక్టర్ కుమార్ 4 గంటలు శ్రమించి నైపుణ్యంతో శస్త్ర చికిత్స నిర్వహించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా శస్త్ర చికిత్సలో పాల్గొన్న వైద్య బృందాన్ని ఆయన అభినందించారు.