JGL:కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్న హనుమాన్ జయంతి వేడుకలు కనులపండువగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయానికి రూ.1.63 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా ప్రసాదాల విక్రయం ద్వారా రూ.1.10 కోట్లు రాగా, దీక్షల విరమణ ద్వారా రూ.33.16 లక్షలు, దర్శనం తదితర సేవల ద్వారా మిగిలిన మొత్తాన్ని భక్తులు సమర్పించుకున్నారు.