ఇంగ్లండ్ వెటరన్ ఆల్‌రౌండర్ రవి బొపారా 23 ఏళ్ల సుదీర్ఘ కౌంటీ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 2026 ఇంగ్లండ్ డొమెస్టిక్ సీజన్‌కు ముందుగా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కొంతకాలంగా ఇంగ్లండ్ T20 బ్లాస్ట్, వన్డే కప్ మాత్రమే ఆడుతున్న అతను.. జాతీయజట్టుకు చివరిగా 2015లో ఆడాడు. ఆదే ఏడాది IPLలోనూ SRHకు ఆడాడు.