AP: టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎంపికైన తనను అభినందించిన పవన్ కళ్యాణ్‌కు మంత్రి లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ‘మీ ఆశీస్సులతో కూటమి స్ఫూర్తిని కొనసాగిస్తూ, రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తాను. తమ్ముడిగా నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. పవన్ చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు’ అని వెల్లడించారు.