TG: బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్ రావు ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జాతీయ అగ్రనేతలతో భేటీ కానున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతంపై అధిష్టానానికి పూర్తి వివరాలను అందజేయనున్నారు. రాష్ట్రంలో పార్టీ చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.