AP: అరుదైన జన్యు వ్యాధులతో బాధపడే పిల్లల కోసం మంత్రి లోకేష్ ‘ప్రాజెక్ట్ పునర్విక’ను ప్రకటించారు. పునర్విక అనే బాలిక ఘటనతో ప్రేరణ పొంది, ఖరీదైన చికిత్సల ఖర్చును తగ్గించేలా అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో అరుదైన వ్యాధులపై సమగ్ర విధానాన్ని తీసుకురావడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.