TG: మీసేవ కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ కొరడా ఝుళిపించింది. ఇవాళ HYDలోని పలు కీలక ప్రాంతాల్లో మీసేవ కార్యాలయాల్లో ACB అధికారులు ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఖైరతాబాద్, అంబర్పేట్, అల్వాల్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అయితే, ప్రజలకు అందించాల్సిన సేవలను దళారుల ద్వారా మీసేవ సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఏసీబీ గుర్తించింది.