TG: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలు, ఆహ్వాన పత్రికలను మంత్రి కొండా సురేఖ విడుదల చేశారు. ఈనెల 19న ఉగాది పర్వదినాన ఈ వేడుకలు ప్రారంభమై ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. 27న సీతారామ కళ్యాణ మహోత్సవం.. ఆ మరుసటి రోజున శ్రీ రామ మహా పట్టాభిషేకోత్సవం అంగరంగ వైభవంగా జరగనున్నాయి.