TG: HYD రాజేంద్రనగర్ పరిధి శివరాంపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. డెకరేషన్ సామగ్రి నిల్వ ఉంచిన గోదాంలో మంటలు చెలరేగాయి. ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. గోదాం పక్కనే ఉన్న నివాస గృహాలకు మంటలు వ్యాపించాయి. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేస్తున్నారు.