TG: మార్చి 3న ఆకాశంలో బ్లడ్ మూన్ అద్భుత దృశ్యమని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. భూమి నీడ చంద్రునిపై పడటం వల్ల, చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. ఈశాన్య భారత రాష్ట్రాలలో చంద్రగ్రహణం బాగా కనిపిస్తుంది. మిగిలిన ప్రాంతాల్లో చంద్రగ్రహణం ముగింపు మాత్రమే కనిపిస్తుందని చెబుతున్నారు. హైదరాబాద్లో సాయంత్రం 6.20గంటల నుంచి 27 నిమిషాల పాటు చంద్రగ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది.