AP: వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్రను గుర్తుచేసుకున్నారు. వైఎస్సార్ పాదయాత్రకు ఇవాళ్టితో 23 ఏళ్లు నిండాయి. ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవడానికి వైఎస్సార్ ప్రారంభించిన పాదయాత్ర చరిత్రనే తిరగరాసిందని తెలిపారు. 2003 APR 9న ఎర్రటి ఎండలో మొదలుపెట్టిన పాదయాత్ర ప్రజల హృదయాల్లో ధైర్యం నింపిందని.. ‘నేనున్నాననే భరోసా ఇచ్చింది’ అని పేర్కొన్నారు.