AP: అమరావతికి జగన్ వ్యతిరేకం కాదని, విశాఖ అభివృద్ధి కూడా తమ లక్ష్యమని YCP నేత కారుమూరి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ఐదేళ్ల YCP పాలనలో రూ.3.32 లక్షల కోట్ల అప్పు చేస్తే, కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.3.42 లక్షల కోట్లు అప్పు చేసిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ‘దోచుకో, దాచుకో’ అన్నట్లుగా పాలన సాగుతోందని, 300కు పైగా ఆలయాలను కూల్చేశారని ఆయన తీవ్రంగా విమర్శించారు.