TG: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో జరిగిన దాడి ఘటనపై మంత్రి వివేక్ స్పందించారు. కావాలనే బీఆర్ఎస్ నాయకులు తమపై దాడి చేశారని అన్నారు. బీఆర్ఎస్ నాయకుల దాడిలో ఒక కానిస్టేబుల్కు తల పగిలి తీవ్ర గాయాలు అయ్యాయని.. అలాగే కాంగ్రెస్ కార్యకర్త కూడా గాయపడ్డారని తెలిపారు.