AP: 300కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించే ప్రతి బస్సు సర్వీసులోనూ ఇద్దరు డ్రైరర్లు కచ్చితంగా ఉండాల్సిందేనని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పస్టంచేశారు. రాత్రిళ్లు డ్రైవర్ నిద్రపోయేందుకు బస్సులో ఒక సీటు కేటాయించాలని, ప్రమాదాల నివారణే తమ ప్రభుత్వ అంతిమ లక్ష్యమని పేర్కొన్నారు. అవసరమైతే భవిష్యత్తులో స్లీపర్ బస్సులు రద్దు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.