నేటి కాలంలో తొందరపాటు నిర్ణయాలు విడాకులకు దారితీస్తున్నాయి. అందుకే భాగస్వామిని పూర్తిగా అర్థం చేసుకునే ‘స్లో డేటింగ్’ ప్రాధాన్యత పెరుగుతోంది. కనీసం మూడు నెలల పాటు ఒకరి అభిరుచులు, ప్రవర్తనను గమనించడం వల్ల సరైన నిర్ణయం తీసుకోవచ్చు. కుటుంబ అంగీకారంతో తగినంత సమయం తీసుకోవడం, పరస్పర గౌరవంతో కూడిన బలమైన బంధానికి బలమైన పునాది వేస్తుందని నిపుణులు చెబుతున్నారు.