AP: మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా ఇటీవల హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో యనమల గుండెకు వైద్యులు స్టెంట్ వేసిన సంగతి తెలిసిందే.