తెలంగాణలో సినిమా ప్రదర్శనల విధానంపై వివాదం రేగింది. అద్దె విధానం వల్ల నష్టపోతున్నామని, ఇకపై పర్సెంటేజ్ పద్ధతిలోనే సినిమాలు ప్రదర్శిస్తామని ఫిలిం ఛాంబర్ ప్రకటించింది. హైదరాబాద్లోని 23 థియేటర్లలో దీనిని అమలు చేస్తున్నారు. మల్టీప్లెక్స్ తరహాలో తొలి వారం 60%, రెండో వారం 50%, మూడో వారం 40% వాటా ఇవ్వాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తున్నారు.