గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో మరో మూవీకి రంగం సిద్ధమైంది. ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరూ కలుస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్టు కోసం చరణ్ ఒక ఏడాది పాటు డేట్స్ కేటాయించినట్లు సమాచారం. సుకుమార్ తన స్టైల్‌కు తగ్గట్టుగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషనల్ డ్రామాను మిక్స్ చేయబోతున్నారట.