స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను ఐకాన్ స్టార్‌గా మార్చిన లెక్కల మాస్టారు సుకుమార్.. ఇప్పుడు అంతకు మించి అనేలా ప్లాన్చేస్తున్నాడు. పుష్ప పార్ట్ వన్ సంచలనంగా నిలవడంతో.. పార్ట్ 2పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే పార్ట్ 2 విషయంలో భారీ మార్పులు చేశారు సుకుమార్. దాంతో బడ్జెట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ అవడం లేదట. పార్ట్ 2 బడ్జెట్‌ని రెండింతలు పెంచి.. దాదాపు 350 కోట్లు ఖర్చు చేయబోతున్నట్టుగా చాలా రోజులుగా వినిపిస్తోంది. ఇటీవలే లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకున్న ‘పుష్ప2’ రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కాబోతోంది. దాంతో ప్రస్తుతం సుకుమార్ షూటింగ్‌కు సంబంధించిన పనులతో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.
అందులోభాగంగా రీసెంట్గా మరోసారి పుష్పరాజ్ లుక్‌ని టెస్ట్ కట్ చేసినట్టు టాక్. ఇక పుష్పలో ఎలా ఉందో.. అదే లుక్‌లో పర్ఫెక్ట్గా కనిపించాడట బన్నీ. అలాగే పుష్పరాజ్ కొత్త లుక్ కూడా టెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అది కూడా సూపర్‌గా ఉండడంతో.. హ్యాపీగా షూటింగ్‌కు వెళ్లిపోవడానికి ఫిక్స్ అయిపోయాడట సుకుమార్. పుష్ప ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయి ఇన్ని రోజులు కావొస్తున్నా.. అల్లు అర్జున్ మాత్రం ఇంకా అదే లుక్‌ని మెయింటేన్ చేస్తున్నాడు. అంటే బన్నీ ఈ సినిమా కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఒక్క బన్నీ లుక్ అనే కాకుండా.. మిగతా నటీ నటుల లుక్ టెస్ట్‌ని కూడా చేశాడట సుక్కు. మొత్తంగా ఇప్పుడు పుష్ప2కి రంగం సిద్దమైనట్టు సమాచారం. ఇకపోతే రష్మిక హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.