టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వెడ్డింగ్ రిసెప్షన్ మార్చి 4న హైదరాబాద్లోని తాజ్ కృష్ణాలో వైభవంగా జరగనుంది. సాయంత్రం 7 గంటలకు మొదలయ్యే ఈ వేడుకకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆహ్వానితులకు పంపిన ‘వన్ టైమ్ క్యూఆర్ కోడ్’ స్కాన్ చేస్తేనే లోపలికి అనుమతిస్తారు. ఆహ్వానం లేని వారు రావొద్దని నిర్వాహకులు కోరారు. ఇక ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.