తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవిపై రామ్ చరణ్ ప్రశంసలు కురిపించాడు. తన తండ్రి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని తెలిపాడు. సాయం కోసం ఇండస్ట్రీ నుంచి ఎవరైనా వస్తే ఆయనే ముందుగా స్పందిస్తారని చెప్పాడు. ‘ఇతరుల కన్నా కూడా నాన్నే నాకు ఎక్కువ స్ఫూర్తినిచ్చిన వ్యక్తి. ఎందుకంటే రోజూ ఆయన్ను చూస్తూ పెరిగాను’ అని చరణ్ చెప్పుకొచ్చాడు.