బాలీవుడ్ హీరోయిన్ నోరా ఫతేహి ఇన్స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేసింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై స్పందించింది. తాను ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో జరుగుతున్న ఘర్షణలు, అక్కడి భయంకరమైన దృశ్యాలు తనను తీవ్రంగా కలచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. తన గురించి ఆందోళన చెందిన వారందరికీ ధన్యవాదాలు తెలిపింది.