MHBD: మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. మంగళవారం భిక్షాటన సమయంలో రూ.5 బిచ్చం తక్కువ ఇచ్చాడనే ఆగ్రహంతో బిచ్చగాడు డిష్ టీవీ స్వాతి మార్కెటర్స్ షాపు యజమాని శ్రీనివాస్‌పై కత్తితో దాడికి యత్నించాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బిచ్చగాడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.