JN: రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కుర్చపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి, సీసీ రోడ్ల నిర్మాణాలను ప్రారంభించారు. గ్రామానికి గోదావరి జలాలను తీసుకువస్తానని, రాష్ట్రంలోనే అభివృద్ధిలో నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలిపేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.