ప్రముఖ సింగర్, పద్మవిభూషణ్ గ్రహీత ఆశా భోంస్లే మృతి పట్ల WWE స్టార్ రెజ్లర్ జాన్ సీనా సంతాపం వ్యక్తం చేశాడు. తన సోషల్ మీడియా వేదికగా ఆమె ఫొటోను పంచుకుంటూ ఆమెపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. అలాగే, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ సైతం ఆమెతో కలిసి ఉన్న ఓ ఫొటోను షేర్ చేసి.. పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ నివాళులు అర్పించాడు.