అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ‘లెనిన్’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కాగా.. తాజాగా రెండో పాటపై అప్డేట్ వచ్చింది. ‘యెట్టా.. యెట్టా’ అంటూ సాగే ఈ పాటను ఏప్రిల్ 16న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక రాయలసీమ బ్యాక్డ్రాప్లో, చిత్తూరు నేపథ్యంలో సాగే ఈ మూవీ 2026, జూన్ 26న థియేటర్లలో సందడి చేయనుంది.