విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోలో ‘ఆదర్శ కుటుంబం’ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా సెట్స్ నుంచి వెంకటేష్, త్రివిక్రమ్ కలిసి ముచ్చటిస్తున్న పిక్ రిలీజ్ చేశారు మేకర్స్. దీన్ని బట్టి సినిమా సగం పూర్తయిందని తెలుస్తోంది. ఇందులో శ్రీనిధి శెట్టి, నారా రోహిత్, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.