నిహారిక కొణిదెల నిర్మాణంలో సంగీత్ శోభన్ హీరోగా వచ్చిన ‘రాకాస’ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మూవీని సామాన్యులకు మరింత చేరువ చేసేందుకు మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్స్‌లో టికెట్ ధరను కేవలం రూ.100గా నిర్ణయించారు. తక్కువ ధరకే వినోదాన్ని అందిస్తుండటంతో, ఈ వీకెండ్ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.