హీరో శర్వానంద్ నటించిన ‘బైకర్’ సక్సెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా శర్వా మాట్లాడుతూ.. తెలుగు సినిమా గర్వపడేలా ‘బైకర్’ ఉంటుందని తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని తెలిపాడు. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. ఈ వేసవిలో ఇది పెద్ద విజయాన్ని అందుకుందన్నాడు.