యువసామ్రాట్ నాగచైతన్య రెండు భారీ చిత్రాలు చేసేందుకు సిద్ధమయ్యాడు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, కింగ్ నాగార్జున కాంబోలో రాబోతున్న మూవీలో చైతు కీలక పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. అలాగే, తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 25వ సినిమాను ‘బెదురులంక 2012’ ఫేమ్ దర్శకుడు క్లాక్స్ దర్శకత్వంలో చేయనున్నాడట. ఈ రెండు ప్రాజెక్టులు అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతున్నాయి.