స్టార్ డైరెక్టర్ అట్లీ, ఆయన భార్య ప్రియా మోహన్ దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. ఇవాళ ప్రియ ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు అట్లీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘నాకు చెల్లి వచ్చేసింది – మీర్’ అంటూ తన కుమారుడి తరఫున ఒక క్యూట్ పోస్టర్ను షేర్ చేశాడు. 2023లో వీరికి కుమారుడు మీర్ జన్మించగా, ఇప్పుడు ఆడబిడ్డ రావడంతో అట్లీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది.