తన లడఖ్ బైక్ రైడ్ విశేషాలను నటి మంజు వారియర్ తాజాగా పంచుకుంది. అజిత్ కుమార్తో కలిసి చేసిన ఆ 14 రోజుల ప్రయాణం తనలో ఎంతో మార్పు తెచ్చిందని తెలిపింది. ప్రొఫెషనల్ రైడర్స్ మధ్య ప్రయాణించడం కొత్త అనుభూతిని ఇచ్చిందని, ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా కాపాడుకోవాలో అజిత్ నేర్పారని చెప్పింది. ఆ ట్రిప్ స్ఫూర్తితోనే తాను బైక్ లైసెన్స్ తీసుకున్నట్లు వెల్లడించింది.