భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది. గతంలో ‘బాహుబలి 2’, ‘పుష్ప 2’ వంటి మూవీలో అన్ని భాషల్లో కలిపి భారీ వసూళ్లు సాధించాయి. కానీ, కేవలం హిందీ వెర్షన్లోనే రూ.1000 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిన తొలి బాలీవుడ్ చిత్రంగా ‘ధురంధర్ 2’ చరిత్ర సృష్టించింది. అంతేకాదు ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమాగానూ రికార్డు నెలకొల్పింది.