‘జననాయగన్’ మూవీ లీక్ వ్యవహారం కోలీవుడ్లో సంచలనం రేపుతోంది. సినిమా ఎడిటింగ్ దశలోనే, పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో లీక్ అయినట్లు మేకర్స్ గుర్తించినట్లు తెలుస్తోంది. సర్క్యులేట్ అవుతున్న ఫుటేజీలోని వాటర్ మార్క్ ఆధారంగా నిందితులను ట్రాక్ చేశారట. ఈ కేసులో ఐదుగురు ప్రధాన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరే సోషల్ మీడియాలో లింక్స్ షేర్ చేసినట్లు టాక్.