• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

అకాల వర్షం.. అన్నదాతల అవస్థలు

VKB: అకాల వర్షాలతో అన్నదాతలు మామిడి తోటల రైతులు అన్నమో రామచంద్ర అంటూ రోదిస్తున్నారు. మండు వేసవికాలంలో వాతావరణ మార్పులతో మామిడి తోటలో అకాల వర్షాలు కురియడంతో మామిడిపండ్లకు పురుగులు పట్టి పనికిరాకుండా పోతాయని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మామిడికాయలు సరిగా కాకపోవడంతో నష్టం వాటిల్లుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

April 15, 2026 / 06:09 AM IST

‘రైతులు ప్యాడీ క్లీనర్ల‌ను సద్వినియోగం చేసుకోవాలి’

NLG: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లను రైతులు సద్వినియోగ పరచుకోవాలని, తద్వారా మిల్లులకు నాణ్యతతో కూడిన ధాన్యం చేరుతుందని పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్ అన్నారు. మంగళవారం ఆయన మునుగోడు మండల కేంద్రంలోని మల్లికార్జున రైస్ మిల్లులో ధాన్యం సేకరణ కేంద్రాల భాద్యులతో మాట్లాడారు.

April 15, 2026 / 06:05 AM IST

మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి: ఐద్వా

BHNG: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) భువనగిరి మండల అధ్యక్ష , కార్యదర్శులు రాసాల నిర్మల, కొండమడుగు నాగమణి డిమాండ్ చేశారు. మంగళవారం భువనగిరి మండలం బస్వాపురంలో ఐద్వా ఇంటింటి సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించి మాట్లాడారు.

April 15, 2026 / 06:04 AM IST

రైలు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు

MDK: మనోహరాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన రైలు ప్రమాదంలో తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన పసుల అన్నపూర్ణ (55) తీవ్రంగా గాయపడింది. తీర్థయాత్రలకు వెళ్లిన అన్నపూర్ణ మనోహరాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు దిగే క్రమంలో రైలు కింద జారీ పడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వైద్యం అందజేస్తున్నారు.

April 15, 2026 / 06:02 AM IST

నకిలీ నంబర్ ప్లేట్ వాహనాలు.. పోలీసుల చర్యలు

HYD: నకిలీ నంబర్ ప్లేట్ల వ్యవహారంపై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిఘా పెంచారు. ఒకే నంబర్‌ను రెండు వాహనాలకు వాడుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చలాన్ల నుంచి తప్పించుకోవడానికి, నేరాలకు పాల్పడటానికి ఇలాంటి మోసాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని, నకిలీ నంబర్ ప్లేట్లు వాడితే వాహనాల సీజ్ తప్పదు అన్నారు.

April 15, 2026 / 06:01 AM IST

“అరైవ్-అలైవ్” ఒక ఉద్యమం కావాలి: డీజీపీ

KMR: రహదారి భద్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం కామారెడ్డిలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం ప్రాణరక్షణకు ముఖ్యమని తెలిపారు. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, SP రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో 300 మందికి హెల్మెట్లు, డ్రైవర్లకు కళ్లజోళ్లు పంపిణీ చేశారు.

April 15, 2026 / 06:01 AM IST

‘ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం’

WNP: ప్రజల్లో అవగాహన కల్పించి ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం అని పాలెం గ్రామ సర్పంచ్ నీరజ, మోజర్ల ఉద్యాన కళాశాల ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారిని బేబీ రాణి అన్నారు. కొత్తకోట మండలం పాలెంలో నిర్వహించిన ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా గ్రామంలో ఎయిడ్స్ నివారణపై నాటక ప్రదర్శన చేశారు. అనంతరం ప్రధాన కూడళ్లలో ర్యాలీ నిర్వహిస్తూ అవగాహన కల్పించారు.

April 15, 2026 / 06:01 AM IST

విద్యార్థులకు ఉచిత హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలు

KNR: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సైదాపూర్ మహాత్మ జ్యోతిబాఫూలే (బాలుర) గురుకులంలో హుజూరాబాద్ ఆర్బఎస్ కే బృందం ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా గురుకులంలోని 269 మంది విద్యార్థులకు (పీడియార్టిషన్) డాక్టర్ సంపత్ రెడ్డి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మొత్తం 42 మంది విద్యార్థులకు సమస్యలు ఉన్నాయన్నారు.

April 15, 2026 / 06:01 AM IST

రేపు తారా డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా

SGR: పట్టణంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 16న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ప్రవీణ తెలిపారు. కోవాలెంట్ లాబరేటరీలో ఉద్యోగాల భర్తీకి ఈ మేళా జరుగుతుందని పేర్కొన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని వెల్లడించారు. ఆసక్తిగల వారు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు కళాశాలకు హాజరు కావాలని సూచించారు.

April 15, 2026 / 06:00 AM IST

‘APK ఫైళ్లను ఓపెన్ చేసి మోసపోవొద్దు’

MNCL: RTO చలానా పేరుతో, శుభాకాంక్షల పేరుతో, వాట్సాప్ ద్వారా వచ్చే APK ఫైళ్లను ఓపెన్ చేసి మోసపోవొద్దని మంచిర్యాల DCP భాస్కర్ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం, పోలీస్ శాఖ తరపున ఇలాంటి ఫైళ్లు పంపించడం జరగదన్నారు. ఇలాంటి ఫైల్‌లు మీ మొబైల్ ఫోన్‌ను హ్యాక్ చేసే ప్రమాదం ఉందన్నారు. ఒకవేళ ఎవరైనా సైబర్ మోసానికి గురైతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలన్నారు.

April 15, 2026 / 06:00 AM IST

40 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

ASF: రెబ్బెన మండలం తక్కల్లపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన 40 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మంగళవారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నమ్మదగ్గ సమాచారంతో తనిఖీలు చేపట్టగా, 80 బ్యాగుల్లో ఉన్న సబ్సిడీ బియ్యం పట్టుబడినట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. వీటిని అక్రమంగా నిల్వ ఉంచిన గజ్జెల నారాయణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

April 15, 2026 / 05:50 AM IST

‘అరైవ్ అలైవ్’ పోస్టర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్

SRCL: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం రూపొందించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమ పోస్టర్‌ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం సిరిసిల్లలో ఆవిష్కరించారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బి. గితే, జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, తదితరులతో కలిసి పోస్టర్ ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరు రహదారి భద్రత నియమాలు పాటించాలని ఆయన కోరారు.

April 15, 2026 / 05:49 AM IST

అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు పట్టివేత

కరీంనగర్ రూరల్ పోలీసులు మంగళవారం దుర్షేడ్ గ్రామ సమీపంలోని గోపాల్పూర్ చౌరస్తా వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకున్నారు. గొల్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేసినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. నిందితులను కోర్టుకు తరలించామన్నారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

April 15, 2026 / 05:36 AM IST

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మైనర్ల మృతి

ఖమ్మం జయనగర్‌ కాలనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మైనర్లు దుర్మరణం పాలయ్యారు. మంగళవారం రాత్రి బల్లెపల్లి నుంచి ఖమ్మం వైపు బైక్‌పై వెళ్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఆగం లోకేష్‌(17) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన మరో యువకుడు పందుల ఫణిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

April 15, 2026 / 05:10 AM IST

అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ సీజ్

SRCL: అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్‌ను వేములవాడ రూరల్ పోలీసులు మంగళవారం సీజ్ చేశారు. నాంపల్లి గ్రామానికి చెందిన దండుగుల లక్ష్మణ్ ఎలాంటి అనుమతులు లేకుండా టిప్పర్‌లో మట్టిని తరలిస్తుండగా ఫాజుల్ నగర్ వద్ద పోలీసులు పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ మేరకు మట్టిని తరలిస్తున్న టిప్పరు సీజ్ చేశారు. అక్రమంగా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.

April 15, 2026 / 05:07 AM IST