HYD: తనపై వస్తున్న అసత్య ప్రచారాలను సినీ నిర్మాత, దర్శకుడు వేణు ఉడుగుల ఖండించారు. ఇటీవల చర్చనీయాంశమైన ఓ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. FIRలో తన పేరు ఎక్కడా లేదని, పంజాగుట్ట పోలీసులు సైతం విచారణలో తన ప్రమేయం లేదని నిర్ధారించారని తెలిపారు. మీడియాలో తన పేరును అనవసరంగా ప్రస్తావిస్తూ తప్పుడు వార్తలు ప్రచారం చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
PDPL: ఓదెల మండల కేంద్రానికి బాల వికాస్ సంస్థ రెండు వాటర్ ప్లాంట్లను మంజూరు చేసింది. సర్పంచ్ కనికిరెడ్డి సతీష్ విజ్ఞప్తి మేరకు ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ ప్రసూన్ రెడ్డి స్థల పరిశీలన చేశారు. అవసరమైన గదులు, నీటి వసతి కల్పిస్తే త్వరలోనే ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. శుద్ధ జలాల లభ్యతపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
VKB: పరిగి MLA రామ్మోహన్ రెడ్డి కుమార్తె మేఘన సంతోష్ రెడ్డిల వివాహం HYDలోని వట్టినాగులపల్లిలో శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు CM రేవంత్ రెడ్డి సతీ సమేతంగా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంత్రులు, MLAలు, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
MNCL: జన్నారంలో ఏర్పడిన ఇసుక సమస్యతో వివిధ రంగాల కార్మికులు ఉపాధిని కోల్పోయారు. జన్నారం అభయారణ్యంలో ఉండడంతో ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. గోదావరి తీరంలో ఉండే ఇసుకను ఆధారంగా చాలామందికి కొంత ఉపాధి దొరుకుతుంది. ప్రభుత్వం ఇసుక సేకరణను నిలిపివేయడంతో వారు ఉపాధి కోల్పోయారు. భవన నిర్మాణం, బ్రిక్స్ తదితర రంగాలలో పనిచేసే కార్మికులకు ఉపాధి లేదు.
NLG: ముడిచమురు కొరత నేపథ్యంలో ప్రభుత్వం పైపుడ్ నేచురల్ గ్యాస్ (PNG) పంపిణీని వేగవంతం చేయాలనుకుంటోంది. ఉమ్మడి జిల్లాలో తొలి విడతగా నల్గొండ, చిట్యాలను ఎంపిక చేశారు. ఇప్పటికే నల్గొండ వీటీ కాలనీలో పైలట్ ప్రాజెక్టు పట్టాలెక్కింది. 24 గంటల్లోగా అనుమతులు మంజూరు చేయాలని సర్కార్ ఆదేశించింది.
KMR: జిల్లాలో ఇంటర్ ఫలితాలు ఆదివారం ఉ.11 గంటలకు విడుదల కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది జిల్లా నుంచి ప్రథమ సంవత్సరంలో 9,013 మంది, ద్వితీయ సంవత్సరంలో 8,940 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలు ఎలా ఉన్నా ఒత్తిడికి లోనుకావద్దని అధికారులు తల్లిదండ్రులకు సూచించారు. ఫలితాల కోసం HIT TV APP చూడండీ.
NLG: మిర్యాలగూడ మండలం తక్కెళ్లపాడులో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై ఎదురుగట్ల శంకరమ్మ (35) అనే మహిళ మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శంకరమ్మ మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
NGKL: తెలకపల్లి మండలం రాకొండలో శనివారం ఉపాధి హామీ పనులను ఏపీవో మల్లేశ్ పర్య వేక్షించారు. ఈ సందర్భంగా కూలీలకు ‘ఎన్ఎంఎంఎస్’ యాప్ పనితీరు, మొబైల్ ద్వారా ఫోటోలు అప్‌లోడ్ చేసే విధానంపై అవగాహన కల్పించారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా కూలీలంతా ఉదయం 7 గంటలకే పని ప్రదేశానికి చేరుకుని, సకాలంలో హాజరు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
MBNR: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఉర్దూ ఘర్ నిర్మాణాన్ని నిరసిస్తూ దళిత సంఘాల రిలే నిరాహార దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. ప్రభుత్వం వెంటనే నిర్మాణాన్ని నిలిపివేసి, దళితుల సంక్షేమానికి కృషి చేయాలని నేత శ్రీరాములు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాములు, యాదయ్య, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
BHNG: బీబీనగర్లో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఒక బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
NLG: జిల్లాలోని మహాత్మాగాంధీ వర్సిటీ అవుట్సోర్సింగ్ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఏజెన్సీ నిర్వాహకులు సకాలంలో జీఎస్టీ చెల్లించకపోవడంతో అధికారులు వేతనాలను నిలిపివేశారు. ఫలితంగా 113 మంది చిరుద్యోగులు రెండు నెలలుగా జీతాల్లేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఏజెన్సీ నిర్వాహకుల బాధ్యతారాహిత్యం మధ్య సామాన్య కార్మికులు బలిపశువులవుతున్నారు.
NZB: కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కారు ఎక్కడం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. దశాబ్దాలుగా కాంగ్రెస్కు అండగా ఉన్న ఆయన, సొంత పార్టీ నేతల వైఖరితో విసిగిపోయి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. గులాబీ కండువా కప్పుకున్న అనంతరం ఉమ్మడి జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్, గతంలో పోచారంపై ఆయన విమర్శల వర్షం కురిపించారు.
SRCL: వీర్నపల్లి మండలం బంజేరులో శనివారం ఇంటి ఎదుట పనులు చేసుకుంటున్న గుగులోతు హంసిని గుర్తు తెలియని వ్యక్తి పలకరించి కళ్లలో కారం చల్లి ఆమె మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లాడు. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమె వద్దకు వచ్చి అమ్మ అని పలకరించి, కారం పొడిని ఆమె కళ్లలో చల్లాడు. ఈ క్రమంలో మెడలో ఉన్న రూ.3 లక్షల విలువైన బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు.
KMM: ప్రతిపాదిత ఆర్వోఆర్ రైల్వే లైన్ నిర్మాణాన్ని నిలిపివేయాలని కోరుతూ కామేపల్లి, డోర్నకల్ మండలాల రైతులు శనివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి విన్నవించారు. గరిడేపల్లి, అమ్మపాలెం, బంజర గ్రామాల మీదుగా లైన్ వేస్తే తమ విలువైన సాగు భూములు పోతాయని, తద్వారా జీవనాధారం కోల్పోతామని వివరించారు. రైల్వే ప్రాజెక్టును ఉపసంహరించుకోవాలని వారు వినతిపత్రం అందజేశారు.
MHBD: బయ్యారం మండలం వెంకట్రాపూరం గ్రామ పంచాయతీ శివారులోని చోక్లాతండాలో శనివారం అర్ధరాత్రి వీధి కుక్కలు సైర్వ విహారం చేశాయి. కుక్కల మంద నలుగురిపై దాడి చేయగా, ఇద్దరు పిల్లలు, ఇద్దరు పెద్దలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆదివారం బయ్యారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో తండా వాసులు భయాందోళనకు గురయ్యారు. ఘటనతో తండా వాసుల్లో భయం నెలకొంది.