MHBD: మరిపెడ మండలం భూక్యతండాలో గ్రామసభలో లబ్ధిదారుల జాబితా పరిశీలనలో అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. 2023-24 సం/ చెందిన నాలుగు కళ్యాణలక్ష్మి చెక్కులు నకిలీధ్రువీకరణ పత్రాలతో పొందినట్లు విచారణలో తేలింది. ఈ ఘటనలో రూ.4లక్షలను రికవరీ చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసినట్లు తహసీల్దార్ కృష్ణవేణి సోమవారం తెలిపారు. ఈవ్యవహారంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపినట్లు చెప్పారు.
JGL: జనగణన- 2027 తొలి విడతలో భాగంగా ఇళ్ల గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోళీకేరి సూచించారు. హైదరాబాద్ నుంచి నిర్వహించిన సమీక్షలో జగిత్యాల కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ల నియామకం, మ్యాప్ తయారీపై దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 18 నుంచి మే 5 వరకు శిక్షణల చేపట్టనున్నట్లు తెలిపారు.
NZB: చందూరు మండలం ఘనపూర్‌లో ఐస్‌క్రీమ్ విక్రయాలను పంచాయతీ పాలకవర్గం నిషేధించింది. కలుషిత ఐస్‌క్రీమ్‌లు తిని చిన్నారులు రోగాల బారిన పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే రూ.5,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం దృష్ట్యా వారిని ఐస్‌క్రీమ్‌లకు దూరంగా ఉంచాలని పంచాయతీ సభ్యులు కోరారు.
ఆసిఫాబాద్ సర్కిల్ పరిధిలో వినియోగదారులకు నాణ్యమైన, అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా అందిస్తున్నామని SE ఉత్తమ్ జాడే తెలిపారు. వేసవిలో నిరంతర సరఫరా కోసం సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు. 751 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు, 4 పవర్ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేసి 6 సబ్‌స్టేషన్‌లు మంజూరు చేసినట్లు అయన తెలిపారు.
PDPL: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పెద్దపల్లిలో నిర్వహించిన పోషణ పక్షోత్సవం- 2026 కార్యక్రమానికి ప్రభుత్వ విప్ విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన 304 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు, 13 మంది దివ్యాంగులకు లాప్‌టాప్‌లు, ట్యాబులు పంపిణీ చేశారు. అలాగే గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం తరఫున సీమంతం చేసి ఆశీర్వదించారు.
BDK: ఆళ్లపల్లి మండలం కిచ్చనపల్లికి చెందిన సతీష్ (24) సోమవారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
MBNR: జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో వార్డు ఆఫీసర్లతో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సమీక్ష నిర్వహించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల పురోగతిపై సమీక్ష నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ వెల్లడించారు. మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు వెంటనే గ్రౌండ్ చేయాలని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రామానుజులు రెడ్డి పాల్గొన్నారు.
ADB: జిల్లాలో రోడ్డు భద్రతపై ప్రతి సర్పంచ్, ఎస్‌హెచ్‌జీ సభ్యులు, రిసోర్స్ పర్సన్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గ్రామ పంచాయతీ ఎజెండాలో రోడ్డు భద్రతా అంశాలను చేర్చి విస్తృతంగా చర్చించాలని సూచించారు. ఇతర అభివృద్ధి ప్రణాళికలతో పాటు రోడ్డు భద్రతను ముఖ్యమైన అంశంగా తీసుకున్నప్పుడే గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా మారుతాయన్నారు.
కామారెడ్డి: ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో 101 గ్రాముల నిషేధిత ఆల్ఫాజోలామ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు పులి రమేశ్ పరారీలో ఉన్నాడన్నారు. మధ్యవర్తి అనిల్ కుమార్ శాంపిల్ చూపించేందుకు వెళ్తుండగా పట్టుబడ్డాడన్నారు. సీఐ రాజారెడ్డి బృందం 24 గంటల్లో ఈ కేసును ఛేదించి, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
HYDలోని CCMB నిర్వహించిన తాజా అధ్యయనంలో కంటి ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాల్లో యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ గణనీయంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది. పరిశోధనలో సుమారు 45% వరకు బ్యాక్టీరియా మందులకు ప్రతిరోధకంగా మారినట్లు గుర్తించారు. ఈ పరిస్థితి చికిత్సను క్లిష్టతరం చేస్తోందని శాస్త్రవేత్తలు తెలిపారు.
MDCL: చర్లపల్లిలో రేబీస్ వ్యాధి నివారణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వీధి కుక్కల సంఖ్య పెరగడంతో ప్రజల్లో భయం నెలకొంది. ఇటీవల కుక్కల కాట్ల ఘటనలు పెరగడంతో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. టీకాలు, పట్టివేత కార్యక్రమాలు చేపట్టి ప్రజల భద్రతను నిర్ధారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
MBNR: మిడ్జిల్ మండలం మసిగుండ్లపల్లిలో అక్రమంగా నిల్వ చేసిన 127 బ్యాగుల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు సోమవారం సీజ్ చేశారు. పక్కా సమాచారంతో ఎన్ఫోర్స్‌మెంట్ డీటీ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
కామారెడ్డిలో నేటి నుంచి వారం రోజుల పాటు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా ఫైర్ స్టేషన్ అధికారి సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ‘Safe school.. safe hospital.. fire safety aware society..Together fire preventation’ అనే నినాదంతో ఈ ఏడాది వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీన ఈ వారోత్సవాలు ముగుస్తాయని ఆయన వెల్లడించారు.
KNR: భాగంగా ఆర్టీసీ, రవాణా, పోలీసు శాఖల ఆధ్వర్యంలో ‘అరైవ్ – అలైవ్’ పై బస్టాండ్ పరిధిలోని KNR -1 డిపో నుంచి గీతాభవన్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరు క్షేమంగా ఇల్లు చేరుకోవడానికి రోడ్డు వినియోగ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రవాణా విభాగ అధికారులు ప్రతిజ్ఞ చేయించారు. ఆర్టీసీ RM బీ. రాజు, KNR టౌన్ ఏసీపీ వెంకటస్వామి, తదితరులు ఉన్నారు.