• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

40 ఏళ్లకే బీపీ, షుగర్.. 44 కేసులు నమోదు

MDCL: 60 ఏళ్లకు రావలసిన రోగాలు ప్రస్తుత జీవన శైలిలో 40 ఏళ్లకే వస్తూ కలవరపెడుతున్నాయి. ఘట్కేసర్, పోచారం, ఉప్పల్, చెంగిచెర్ల, కుషాయిగూడ సర్కిల్ ప్రాంతాల్లో కేవలం 40 ఏళ్ల వయస్సు ఉన్న 44 మందికి షుగర్ వచ్చినట్లు డాక్టర్లు గుర్తించారు. కొంత మందికి బరువు తగ్గటం, కళ్ళు మసకబారడం, విరోచనాలు, ఒక్కసారిగా కాళ్ల మంటలు, తరచూ మూత్రం, నీరసం లాంటి లక్షణాలు కనిపించాయి.

April 8, 2026 / 05:00 PM IST

‘మున్సిపల్ కార్మికులకు ఆదివారం సెలవు ఇవ్వాలి’

SRPT: మున్సిపల్ కార్మికులకు చట్టప్రకారం ఆదివారం సెలవు ప్రకటించాలని BRTU జిల్లా గౌరవ అధ్యక్షులు వెంపటి గురూజీ డిమాండ్ చేశారు. సూర్యాపేటలో రైతుబజార్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం వేతనాల పెంపు హామీని విస్మరించిందని మండిపడ్డారు. ఎండ తీవ్రత దృష్ట్యా వసతులు కల్పించాలని, లేదంటే ఆందోళనలు చేపడతామని అధికారులను హెచ్చరించారు.

April 8, 2026 / 04:51 PM IST

ఘోర ప్రమాదం.. జిల్లా యువకుల దుర్మరణం

NLG: HYD వనస్థలిపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హాలియా మండలం అల్వాల వాసి శివ (20), మిర్యాలగూడ వాసి సందీప్(20) మృతి చెందారు. మంగళవారం రాత్రి వీరు రోడ్డు పక్కన ఆగి ఉండగా.. మద్యం మత్తులో ఉన్న రామ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి కారుతో బలంగా ఢీకొట్టాడు. దీంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

April 8, 2026 / 04:50 PM IST

మార్కెట్ యార్డులో శనగ కొనుగోళ్లు నిలిపివేత

ADB: తాంసి సబ్ మార్కెట్ పరిధిలోని శనగ రైతులకు మార్కెట్ కమిటీ కీలక సూచన చేసింది. యార్డులో నిల్వలు నిండుకోవడంతో ఏప్రిల్ 9 (గురువారం) నుంచి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు సెంటర్ ఇన్ఛార్జ్ ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రైతులు తమ పంటను మార్కెట్‌కు తీసుకురావద్దని కోరారు. నిల్వల తరలింపు అనంతరం తిరిగి కొనుగోళ్లు ప్రారంభిస్తామని తెలిపారు.

April 8, 2026 / 04:48 PM IST

‘ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు’

PDPL: ఆయిల్ ఫామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. ఇవాళ ఆయన పాలకుర్తి మండలం ఈసాల తక్కల్లపల్లిలో ఆయిల్ ఫామ్ పంటపై సమీక్షలో పాల్గొన్నారు. పంట సాగుకు ఎకరాకు 4 సం. పాటు మొత్తం ప్రభుత్వం 52 వేల ఆర్థిక సహాయం అందిస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మొదటి విడత లబ్ధి పొందిన చంద్రయ్య, స్వప్నకు రూ. 43000 విలువైన చెక్కులు అందజేశారు.

April 8, 2026 / 04:47 PM IST

రేపు నల్గొండలో నర్రా రాఘవరెడ్డి వర్ధంతి

NLG: మాజీ ఎమ్మెల్యే, CPM రాష్ట్ర కమిటీ సభ్యుడు నర్రా రాఘవరెడ్డి వర్ధంతిని రేపు నల్గొండలో నిర్వహించనున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్‌లో నిర్వహిస్తున్నట్లు CPM జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు సకాలంలో విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

April 8, 2026 / 04:44 PM IST

ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

NRML: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిర్మాణం పూర్తవుతున్న అత్యవసర వైద్య సేవల విభాగాన్ని త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రిలో శస్త్రచికిత్స గదులు, ఐసీయూ, డయాలసిస్ కేంద్రం తదితర విభాగాలను మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

April 8, 2026 / 04:42 PM IST

‘మెరుగైన విద్యుత్ సేవలు అందిస్తాం’

SRCL: వినియోగదారులకు మెరుగైన విద్యుత్ సేవలు అందిస్తామని జిల్లా సర్కిల్ సూపరిండెంటెంట్ బిక్షపతి అన్నారు. తంగళ్ళపల్లి మండలం రామన్న పల్లెలో నూతన విద్యుత్ ఉపకేంద్రం నిర్మించడానికి బుధవారం స్థల పరిశీలన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ విద్యుత్ ఉపకేంద్రం ద్వారా రామన్నపల్లి, బద్దెనపల్లి, బస్వాపూర్, అంకుసాపూర్, రామాజీపేటకు మెరుగైన విద్యుత్ అందుతుందన్నారు.

April 8, 2026 / 04:42 PM IST

వీపనగండ్లలో హెచ్‌పీవీ టీకా ప్రారంభం

WNP: వీపనగండ్ల మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని వైద్యాధికారి డా. రాజశేఖర్ ఇవాళ ప్రారంభించారు. 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు ఈ టీకా అందిస్తున్నారు. హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల వచ్చే క్యాన్సర్ నివారణకు ఇది ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.

April 8, 2026 / 04:40 PM IST

‘లేబర్ కోడ్‌లను రద్దు చేసే వరకు పోరాడతాం’

BDK: ఇల్లందు భగత్ సింగ్ సెంటర్‌లో IFTU ఆధ్వర్యంలో బుధవారం కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. అధ్యక్షుడు కొక్కు సారంగపాణి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భగత్ సింగ్ స్ఫూర్తితో కార్మిక వర్గం కోడ్‌లను రద్దు చేసే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు.

April 8, 2026 / 04:38 PM IST

LOC చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

MBNR: కౌకుంట్ల మండల కేంద్రానికి చెందిన చంద్రయ్య అనారోగ్యంతో HYD నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ క్రమంలో ఆయనకు ప్రభుత్వం నుంచి మంజూరైనరూ. 2.50 లక్షల LOC పత్రాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి బుధవారం బాధితుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.

April 8, 2026 / 04:34 PM IST

బిచ్కుంద మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరణ

KMR: బిచ్కుంద మున్సిపాల్ కమిషనర్‌గా బాన్సువాడ కమిషనర్ శ్రీహరి రాజు బుధవారం అదనపు బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ కమిషనర్‌గా ఉన్న హయ్యుం మెడికల్ లీవ్‌లో ఉన్నారని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ మాట్లాడుతూ.. మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అందరిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తానన్నారు.

April 8, 2026 / 04:33 PM IST

పట్టణంలో పోలీసుల ప్రత్యేక తనిఖీలు

NRPT: నారాయణపేట పట్టణంలో దొంగతనాల నివారణకు పోలీసులు ఇవాళ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. నగదు లావాదేవీల కోసం వచ్చిన వినియోగదారులకు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.

April 8, 2026 / 04:33 PM IST

ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభం

GDWL: గద్వాల మండలం జమ్మిచేడు గ్రామంలో ఓ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని కౌన్సిలర్ లలితమ్మ, సంస్థ ప్రతినిధులు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామంలోని పేద, మధ్యతరగతి మహిళలతో పాటు జోగిని, దళిత, ఒంటరి మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.

April 8, 2026 / 04:30 PM IST

ఆర్టిజన్ కార్మికుల ఆందోళన

MDK: తూప్రాన్ డివిజన్ పరిధిలోని ఆర్టిజన్ విద్యుత్ కార్మికులు విధులను బహిష్కరించారు. జేఏసీ పిలుపు మేరకు విధులను బహిష్కరించిన ఆర్టిజన్ కార్మికులు తూప్రాన్ విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. యాజమాన్యం డిమాండ్లపై దిగి రాకుంటే సమ్మెను ఉధృతంగా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ ఛైర్మన్ స్వామి, కన్వీనర్ ఎస్కే షాదుల్ హుస్సేన్ పాల్గొన్నారు.

April 8, 2026 / 04:30 PM IST