• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

గుడుంబా స్థావరాలపై పోలీసులు దాడులు

BHPL: మల్హర్ రావు మండలం కొండంపేట గ్రామానికి చెందిన కొరకాని సమ్మయ్య అనే వ్యక్తి గుడుంబా తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు ఇవాళ దాడులు నిర్వహించారు. అతని వద్ద నుంచి 20 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, 600 లీటర్ల బెల్లం పానకాన్ని క్షేత్రస్థాయిలోనే ధ్వంసం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 8, 2026 / 03:14 PM IST

కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ నాయకులు

ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని MLA క్యాంపు కార్యాలయంలో నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ MLA బొజ్జు ఆధ్వర్యంలో జన్నారం మండలం టీజీ పల్లి నుంచి పెర్క సంఘం మండల అధ్యక్షుడు, నాయకులు ఉపసర్పంచ్, వార్డ్ మెంబెర్స్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. MLA వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్‌లో చేరామని వారు తెలిపారు.

April 8, 2026 / 03:12 PM IST

CEIR పోర్టల్‌తో మిస్సైన మొబైల్స్ రికవరీ

HNK: జిల్లాలో ఎల్కతుర్తి పోలీసులు CEIR పోర్టల్ సహాయంతో మిస్సైన రెండు మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని యజమానికి అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసుల వేగవంతమైన చర్యలను ఉన్నత అధికారులు అభినందించారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్‌లు పోయిన వెంటనే CEIR పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.

April 8, 2026 / 03:11 PM IST

ఆసిఫాబాద్‌లో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రత పెరగడంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. వాతావరణ శాఖ ప్రకారం రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. మధ్యాహ్న సమయంలో అనవసరంగా బయటకు వెళ్లకుండా, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

April 8, 2026 / 03:06 PM IST

పెళ్లికి ఐదు రోజుల ముందే ఆత్మహత్య

HYD: నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గచ్చిబౌలికి చెందిన వెంకటకృష్ణ శ్రీ సాయి అనే యువకుడికి పెళ్లి కుదిరింది. అయితే, పెళ్లికి ఐదు రోజులు మాత్రమే ఉండగా యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులే ఈ బలవన్మరణానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

April 8, 2026 / 03:04 PM IST

జమ్మికుంట మార్కెట్‌లో సల్పంగా పెరిగిన పత్తి ధరలు

KNR జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో బుధవారం పత్తి ధరలు స్వల్పంగా తగ్గాయి. నేడు మార్కెట్ కు మొత్తం 5 వాహనాల్లో 45 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి రాగా.. గరిష్ఠంగా రూ.7900, కనిష్ఠంగా రూ.6,500 ధర పలికింది. మార్కెట్లో కార్యకలాపాలను మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా పరిశీలించారు. అధికారులు పత్తి ధరలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు

April 8, 2026 / 03:02 PM IST

అంబేద్కర్ అవార్డు గ్రహీతకు సన్మానం

PDPL: ధర్మారం మండల కేంద్రానికి చెందిన తెలంగాణ వాణి పత్రికా రిపోర్టర్ సుంచు మల్లేశం ఇటీవల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు స్వీకరించారు. ఈ సందర్భంగా ఇవాళ బంజేరుపల్లి తండా ఆల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు మోతిలాల్ నాయక్ ఆధ్వర్యంలో స్థానిక ప్రాథమిక పాఠశాలలో మల్లేశంను ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకోవాలని వారు ఆకాంక్షించారు.

April 8, 2026 / 03:01 PM IST

లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం: చుక్కా రాములు

SRD: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా కార్మికులు ఐక్యంగా పోరాటం చేయాలని సీఐటీయు రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు అన్నారు. సంగారెడ్డిలోని కేకే భవన్‌లో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకునేది ఒక్క సీఐటీయు మాత్రమే అని చెప్పారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశం పాల్గొన్నారు.

April 8, 2026 / 03:01 PM IST

‘జాగృతి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలి’

NRPT: జిల్లాలో తెలంగాణ జాగృతి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. నారాయణపేట పట్టణ జాగృతి పార్టీ అధ్యక్షుడిగా చంద్రు ముదిరాజ్‌కు జిల్లా కార్యాలయంలో బుధవారం నియామక పత్రాన్ని అందించారు. పార్టీ వ్యవస్థాపకులు కల్వకుంట్ల కవిత సారథ్యంలో పార్టీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

April 8, 2026 / 03:01 PM IST

ప్రెస్ క్లబ్ స్థలానికి వినతి పత్రం అందజేత

NRPT: మద్దూరు మండలంలో జర్నలిస్టుల ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి 150 గజాల స్థలం కేటాయించాలని కోడంగల్ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఏనుమల తిరుపతిరెడ్డికి జర్నలిస్టుల సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ఆయన స్థలం కేటాయింపుపై రెవెన్యూ అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధ్యక్షుడు విజయకుమార్, మండల జర్నలిస్టులు పాల్గొన్నారు.

April 8, 2026 / 03:01 PM IST

తప్పిన ప్రమాదం.. రోడ్డుపై బియ్యం సంచులు

MDK: రామాయంపేట ఎఫ్‌సీఐ గోదాం నుంచి దంతేపల్లి వెళ్తున్న బియ్యం లారీ క్యాట్రియాల శివారులోని గుంతల రోడ్డు కారణంగా కుదుపునకు లోనైంది. దీంతో లోడులోని బియ్యం సంచులు ఒక్కసారిగా రోడ్డుపై జారిపడ్డాయి. ఆ సమయంలో వాహనాలేవీ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సిబ్బంది వెంటనే స్పందించి బస్తాలను తిరిగి లారీలోకి చేర్చారు. లోడ్ అజాగ్రతగా తరలించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

April 8, 2026 / 03:01 PM IST

పాఠశాలలో మాక్ పార్లమెంట్ కార్యక్రమం

SDPT: బెజ్జంకి మండలం గుండారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ తాళ్లపల్లి భీమయ్య మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు శ్రీరామ్ శ్రీనివాస్, హెచ్‌ఎం నాగవేణి పాల్గొన్నారు.

April 8, 2026 / 03:01 PM IST

గొల్లపల్లి సభకు అనుమతి రద్దు

WNP: రేవల్లి మండలం గొల్లపల్లి రిజర్వాయర్ వ్యతిరేకంగా రైతుల దీక్షలకు మద్దతుగా జరగాల్సిన బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఈ నెల 9న జరగాల్సిన సభలో మాజీ మంత్రి హరీశ్రావు పాల్గొనాల్సి ఉంది. అనుమతి రద్దును మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఖండిస్తూ ప్రజాస్వామ్య హక్కులపై ఆంక్షలంటూ విమర్శించారు. హైకోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

April 8, 2026 / 03:01 PM IST

భీమ్ ఆర్మీ మహా ర్యాలీ పోస్టర్ ఆవిష్కరణ

GDWL: కేటి దొడ్డి మండలం ఇక్కిచేడు గ్రామంలో బుధవారం భీమ్ ఆర్మీ మహా ర్యాలీ పోస్టర్‌ను జిల్లా అధ్యక్షుడు వర్షిత్ ఆవిష్కరించారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 13న నిర్వహించనున్న ‘4వ అంబేడ్కర్ ఆలోచన పండుగ’కు సంబంధించి ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. రాజ్యాంగ నిర్మాత ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.

April 8, 2026 / 03:01 PM IST

తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన కలెక్టర్

నిజామాబాద్ జిల్లా కంటేశ్వర్‌లో నూతనంగా నిర్మించిన రూరల్ తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ప్రారంభించారు. కార్యాలయ సదుపాయాలను పరిశీలించి, ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేంద్ర కుమార్, తహసీల్దార్ వినయ్ సాగర్, తదితరులు పాల్గొన్నారు.

April 8, 2026 / 03:01 PM IST