• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత కాంగ్రెస్ దే’

ఆదిలాబాద్ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే పద్ధతి కాంగ్రెస్ పార్టీదేనని TPCC రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బజార్హత్నూర్ మండలంలోని పిప్పిరి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. డిప్యూటీ CM మల్లు భట్టి విక్రమార్క తన పాదయాత్ర ద్వారా తెలుసుకున్న సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్లడం జరుగుతుందని పేర్కొన్నారు.

April 6, 2026 / 04:24 PM IST

అల్వాల్‌లో హిందూ సమ్మేళన ఏర్పాట్ల సమావేశం

MDCL: టెంపుల్ అల్వాల్‌లో ఏప్రిల్ 12న జరగనున్న హిందూ సమ్మేళన కార్యక్రమం ఏర్పాట్లపై సోమవారం వాసవి ఎంక్లేవ్ కమ్యూనిటీ హాల్‌లో సమావేశం జరిగింది. సుమారు 20 కాలనీల ప్రతినిధులు పాల్గొని హిందూ ఐక్యత, సనాతన ధర్మ పరిరక్షణపై చర్చించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా హాజరుకావాలని సమితి అధ్యక్షులు బండపల్లి శివ శరణప్ప పిలుపునిచ్చారు.

April 6, 2026 / 04:23 PM IST

ప్రజావాణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

NZB: ప్రజావాణిలో సేకరించిన అర్జీదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఆయా ఫిర్యాదులపై పరిశీలన జరుపుతూ.. వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

April 6, 2026 / 04:21 PM IST

‘పశువుల ఆరోగ్య రక్షణకు టీకాలు కీలకం’

KNR: శంకరపట్నం మండలంలోని అంబేద్కర్ నగర్ గ్రామంలో గాలికుంటు వ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ పులికోట ప్రేమలత మాట్లాడుతూ.. పశువుల ఆరోగ్య రక్షణకు టీకాలు కీలకమని పేర్కొన్నారు. రైతులు నిర్దిష్ట కాలాల్లో టీకాలు వేయించడంతో పాటు పరిశుభ్రత పాటించాలని సూచించారు. పశువుల్లో అనారోగ్య లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.

April 6, 2026 / 04:17 PM IST

‘బుద్ధ జయంతి రోజున సెలవు ఇవ్వాలి’

ADB: బౌద్ధధర్మ స్థాపకుడు గౌతమ బుద్ధుడు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ సెలవు ప్రకటించాలని అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు సుభాష్ కోరారు. ఈ మేరకు ఉట్నూర్ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. సమాజసేవ కోసం పాటుపడిన వారి సేవలను ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

April 6, 2026 / 04:17 PM IST

ఉమ్మడి జిల్లాను అభివృద్ధి చేయాలి: ఎమ్మెల్యే

ADB: గత 75 సంవత్సరాలుగా వెనుకబడిన ఉమ్మడి అదిలాబాద్ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి తీసుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కోరారు. పిప్పిరి బహిరంగ సభలో ఉమ్మడి జిల్లాలోని పలు సమస్యలను ముఖ్యమంత్రితో విన్నవించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని పేర్కొన్నారు.

April 6, 2026 / 04:14 PM IST

వర్క్‌షాప్ బ్రోచర్ ఆవిష్కరణ

MBNR: PUలో ఈనెల 7న నిర్వహించనున్న “WEB3 & Blockchain Basics” వర్క్‌షాప్ బ్రోచర్‌ను వీసీ ప్రొఫెసర్ జి.ఎన్. శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఎంబీఏ విభాగం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేశ్ బాబు, ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి, HOD జావేద్ ఖాన్ పాల్గొన్నారు. ఆధునిక సాంకేతికతపై విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమని వీసీ తెలిపారు.

April 6, 2026 / 04:11 PM IST

పారిశ్రామిక ప్రాంత ప్రజలకు CSR నిధుల టోకరా: కస్బా

SRD: పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంత ప్రజల CSR నిధుల దారి మల్లింపును అడ్డుకుంటామని పారిశ్రామిక ప్రాంతాల మేధావుల ఫోరం కన్వీనర్ కస్బా శంకర్ రావు సోమవారం HIT TVతొ అన్నారు. మేధావుల ఫోరం సభ్యులు RVS రవి, ఇక్రిశాట్ బిక్షపతి, జగన్ రెడ్డి, శేషాద్రిలతో కలిసి ఆయన మాట్లాడుతూ.. పారిశ్రామిక ప్రాంతాల CRS నిధులు మళ్లించకూడదని సుప్రీం కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వందల కోట్లు మాయంచేస్తున్నారు.

April 6, 2026 / 04:09 PM IST

కొడకండ్లలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు

JN: కొడకండ్ల మండల కేంద్రంలో బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఉపేందర్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. మండల వ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఈ ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

April 6, 2026 / 04:09 PM IST

రోటిగూడలో బీజేపీ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు

MNCL: జన్నారం మండలంలోని రోటిగూడలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. BJP నాయకులు పార్టీ జెండా ఆవిష్కరించి, స్వీట్లు పంపిణీ చేశారు. నాయకులు మాట్లాడుతూ.. బీజేపీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని, జాతీయ సేవ, జాతీయత, క్రమశిక్షణ, ప్రజల పట్ల నిబద్ధత అనే విలువలతో ముందుకు సాగే ఒక మహాత్తర జాతీయ ఉద్యమమని స్పష్టం చేశారు.

April 6, 2026 / 04:07 PM IST

తక్కువ సరఫరా.. పెరిగిన పత్తి ధరలు

KNR: మూడు రోజుల విరామం తర్వాత జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ సోమవారం తిరిగి ప్రారంభమైంది. మార్కెట్లో పత్తి ధర గత వారం కంటే రూ.200 పెరిగి గరిష్ఠంగా రూ.7,950 పలికింది. మొత్తం 8 వాహనాల్లో 44 క్వింటాళ్ల పత్తి విక్రయానికి రాగా, దిగుబడి లేని సమయంలో ధర పెరగడంతో రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

April 6, 2026 / 04:06 PM IST

హుస్నాబాద్‌లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం

SDPT: హుస్నాబాద్‌లో ఇవాళ ప్రయాణికులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్సై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపితే రూ.10 వేల జరిమానా విధిస్తామని తెలిపారు. ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని, మైనర్‌లకు వాహనాలు ఇవ్వొద్దని హెచ్చరించారు. లైసెన్స్ లేని వారు వెంటనే పొందాలని సూచించారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడరాదన్నారు.

April 6, 2026 / 04:06 PM IST

కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ

HNK: రుద్రేశ్వర స్వామి వేయి స్తంభాల గుడి అభివృద్ధి కోసం కేంద్రం నుంచి భారీ నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌‌కు ఎంపీ కడియం కావ్య కృతజ్ఞతలు తెలిపారు. కాకతీయుల శిల్ప కళా సంపదకు ప్రతీకగా నిలిచిన వేయి స్తంభాల గుడి అభివృద్ధి ద్వారా పర్యాటక రంగం మరింతగా అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందన్నారు.

April 6, 2026 / 04:05 PM IST

స్కూల్ బస్సులను తనిఖీ చేసిన పోలీసులు

MHBD: గార్ల, బయ్యారం మండలాల పరిధిలో సీఐ రవీందర్ స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా డ్రైవర్‌లు మద్యం తాగి, అతివేగంతో వాహనాలు నడపవద్దని హెచ్చరించారు. వాహనాలకు సరైన ధ్రువపత్రాలు ఉండాలని, డ్రైవర్‌లు క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

April 6, 2026 / 04:05 PM IST

సీఎం అంటే తండ్రి లాంటివాడు: ఎమ్మెల్యే

ADB: సీఎం అంటే నియోజకవర్గానికి తండ్రి లాంటివాడని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. బజరహత్నూర్ మండలం పిప్పిరి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బోథ్ మండలాన్ని రెవెన్యూ డివిజన్‌గా ప్రకటించాలని ముఖ్యమంత్రితో విన్నవించారు. జిల్లాలో వెనుకబడిన బోథ్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని MLA కోరారు.

April 6, 2026 / 04:02 PM IST