• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడిన ఎంపీ

BDK: కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. కొత్తగూడెంలో శనివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరును మిత్రపక్ష ఎమ్మెల్యే కూడా ఖండిస్తున్నారని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గులాబి జెండా ఎగురుతుందని అన్నారు.

April 4, 2026 / 02:14 PM IST

మక్కల కొనుగోలు కేంద్రం పరిశీలన: వెంకట్రామ్ రెడ్డి

HNK: ఆత్మకూరు మండలం గూడెప్పాడ్ గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొక్కజొన్న (మక్కల) కొనుగోలు కేంద్రాన్ని శనివారం డీసీసీ జిల్లా అధ్యక్షులు, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, నీడ వంటి కనీస సదుపాయాలు కల్పించాలని నిర్వాహకులకు సూచించి. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కేంద్రాలను వినియోగించుకోవాలి.

April 4, 2026 / 02:14 PM IST

‘సకాలంలో ఇంటి పన్ను చెల్లించండి’

MHBD: తొర్రూరు మున్సిపాలిటీ పరిధిలో ఈనెల 30వ తేదీలోగా ఇంటి పన్ను చెల్లించి ఐదు శాతం రాయితీ పొందవచ్చని మున్సిపల్ కమిషనర్ వక్కాల శ్యాంసుందర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మే నెల నుంచి ఇంటి పన్నుపై వడ్డీ పెరుగుతుందని, ఈ విషయాన్ని గృహ వినియోగదారులు గమనించి సకాలంలో పన్ను చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.

April 4, 2026 / 02:12 PM IST

ఫోటోగ్రాఫర్ కన్నుమూత

కరీంనగర్ చింతకుంటకు చెందిన 44 ఏళ్ల ఫోటో గ్రాఫర్ దాసరి శ్రీనివాస్ అనారోగ్యంతో అకాల మరణం చెందారు. సామాజిక, సాంస్కృతిక, భక్తి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే ఆయన మృతి స్థానికులను కలచివేసింది. చింతకుంట ప్రజలు, యువత తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పలువురు రాజకీయ, సామాజిక ప్రముఖులు ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించి కుటుంబానికి సానుభూతి తెలిపారు.

April 4, 2026 / 02:11 PM IST

సీఎస్ఐ వెస్లీ చర్చిలో రక్తదాన శిబిరం

MNCL: గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని మంచిర్యాలలోని సీఎస్ఐ వెస్లీ చర్చిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 50 మంది యువకులు రక్తదానం చేశారు. రక్తదాతలకు రెడ్ క్రాస్ సొసైటి జిల్లా ప్రధాన కార్యదర్శి చందూరి మహేందర్ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బ్లడ్ బ్యాంకు వైద్యులు డాక్టర్ ప్రేమ్ సాయి, పాస్టర్ శ్రీనివాస్, ప్రసాద్ పాల్గొన్నారు.

April 4, 2026 / 02:10 PM IST

అంబేడ్కర్ జయంతి పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ

NGKL: ఈనెల 14న అచ్చంపేట పట్టణంలో నిర్వహించ తలపెట్టిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల కరపత్రాలను నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డాక్టర్ B.R అంబేడ్కర్ ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన మహానేత అన్నారు.

April 4, 2026 / 02:04 PM IST

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన వైస్ ఛైర్మన్

MHBD: దంతాలపల్లి రైతు వేదికలో అర్హులైన లబ్ధిదారులకు తొర్రూరు మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బట్టు సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేశారు. వైస్ చైర్మన్ మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా లబ్ధి పొందాలన్నారు.

April 4, 2026 / 01:51 PM IST

వర్థన్నపేట 3వ వార్డులో ‘ప్రజా బాట’ నిర్వహణ

WGL: వర్థన్నపేట పట్టణ కేంద్రంలోని 3వ వార్డులో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజా బాట’ కార్యక్రమం శనివారం నిర్వహించారు. విద్యుత్ ఏఈ తరుణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి విద్యుత్ సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యుత్ తీగల పరిస్థితి, సరఫరా సమస్యలు, వంటి అంశాలను పరిశీలించి,ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.

April 4, 2026 / 01:47 PM IST

‘జయంతి వేడుకలు విజయవంతం చేయాలి’

VKB: బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించాలని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రామచందర్ పిలుపునిచ్చారు. శనివారం VKBలోని ఆర్అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుల ఆశయాలను స్మరించుకుంటూ, ఉత్సవాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

April 4, 2026 / 01:46 PM IST

మహాదేవపురంలో ఉచిత కంటి వైద్య శిబిరం

KMM: మహదేవపురం గ్రామంలో ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ జి. రవిచంద్ర, మహాదేవపురం సర్పంచ్ వాసిరెడ్డి నాగేశ్వరరావు, పుతుంబాక సుభాష్, పుతుంబాక శ్రీకృష్ణ ప్రసాద్, పాల్గొని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరాన్ని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని వైద్య సిబ్బంది తెలిపారు.

April 4, 2026 / 01:42 PM IST

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఆదరణను చూరగొంటోంది : ఎమ్మెల్యే

MBNR: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ఆదరణను చూరగొంటోందని దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల రెండవ తేదీన గ్రామస్థాయిలో పట్టణ స్థాయిలో నిర్వహించిన గ్రామసభలు విజయవంతం అయ్యాయని వెల్లడించారు. ప్రజలు తమ ప్రభుత్వంతో ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు.

April 4, 2026 / 01:42 PM IST

కల్వకుర్తిలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం

NGKL: కల్వకుర్తి పట్టణంలో శనివారం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ర్యాలీని మున్సిపల్ ఛైర్మన్ బృంగి రత్నమాల ఆనంద్ కుమార్ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ…ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చినది ఏసుప్రభువు అని అన్నారు. ప్రభు ఏసుక్రీస్తు చూపిన మార్గంలో నడవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని పేర్కొన్నారు.

April 4, 2026 / 01:35 PM IST

గాలికుంటు వ్యాధి వ్యాక్సిన్ ప్రచారం ప్రారంభించిన సర్పంచ్

MDK: రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో శనివారం గాలికుంటు వ్యాధి నివారణ టీకా ప్రచార కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కొత్త స్రవంతి రాజేందర్ గుప్తా ప్రారంభించారు. పశువులకు వ్యాధులు సంక్రమించకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని, అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

April 4, 2026 / 01:35 PM IST

‘అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని జయప్రదం చేయండి’

BDK: భద్రాచలం పట్టణ కేంద్రంలోని బీఎస్పీ నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి మహబూబాబాద్ పార్లమెంటు జోన్ ఇంఛార్జ్ తాండ్ర వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. వరంగల్‌లో ఏప్రిల్ 14 న జరిగే బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాన్నీ ప్రజలు పార్టీ శ్రేణులు పాల్గొని జయప్రదం చేయకానీ పిలుపునిచ్చారు.

April 4, 2026 / 01:35 PM IST

CM బహిరంగ సభను విజయవంతం చేయాలి: TPCC ఛీఫ్

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో TPCC రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ DCC నూతన కార్యవర్గం, పొలిటికల్ యాక్షన్ కమిటీతో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలన్నారు. ఈనెల 6న భజరహత్నూర్ మండలంలోని పిప్పిరి గ్రామంలో CM రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని అన్నారు.

April 4, 2026 / 01:34 PM IST