KNR: ఈ నెల 14న హుజూరాబాద్‌లో నిర్వహించే అంబేద్కర్ 136వ జయంతి ఉత్సవాలకు కమిటీ చైర్మన్‌గా ఆడేపు సురేందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం హుజురాబాద్ క్లబ్‌లో ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కమిటీ అధ్యక్షులు మారేపల్లి శ్రీనివాస్, కౌన్సిలర్లు సమ్మయ్య, మొగిలి, నాయకులు ఆలేటి రవీందర్, వేల్పుల రత్నం, తదితరులు పాల్గొన్నారు.
SRPT: యేసు ప్రభువువారి ఈస్టర్ పండుగ సందర్భంగా కోదాడ పట్టణంలో నియోజకవర్గ పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో రెవరెండ్ డాక్టర్ వి. యేసయ్య పాస్టర్ ఆర్గనైజేషన్‌తో రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరత్నం బాబు హాజరై జండా ఊపి రన్ ఫర్ జీసస్ ర్యాలీని ప్రారంభించారు.
KMM: ఇటీవల అనారోగ్యానికి గురై ఖమ్మం నగరంలోని స్థంభాద్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ వ్యాపారవేత్త ఆకుల భాస్కర్ రావును రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శనివారం పరామర్శించారు. ఆయనకు అందుతున్న చికిత్స గురించి ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అలాగే అక్కడే చికిత్స పొందుతున్న హరి ప్రసాద్‌ను కూడా పరామర్శించారు.
MDK: రామాయంపేట మున్సిపాలిటీ 11, 12వ వార్డులో నెలకొన్న ముంపు ప్రాంత ప్రజల సమస్య శాశ్వత పరిష్కారానికి మున్సిపల్ పాలకవర్గం చర్యలు చేపట్టారు. అక్కల బస్తిలోని లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజ్ నిర్మాణం సరింగా లేకపోవడంతో నూతన డ్రైనేజ్ నిర్మాణానికి పనులు ప్రారంభించారు. ఎంతోకాలంగా లోతట్టు ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతుండడంతో శాశ్వత పరిష్కారం చేపడుతున్నారు.
NLG: నార్కట్‌పల్లి శివారులో రైలు కింద పడి కొండకింది హరీష్ రెడ్డి (28) అనే యువకుడు ఇవాళ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు చిట్యాల మండలం ఎలికట్టెకు చెందినవాడు. ఉన్నత చదువులు చదివినా ఆశించిన ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. చేతికి అందివచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
NZB: జిల్లా కాంగ్రెస్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన ఒక సామాజిక వర్గానికి చెందిన కీలక నేత పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తగిన గుర్తింపు, పదవులు దక్కలేదని అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. పార్టీ కోసం మొదటి నుంచీ కష్టపడినా, పదవుల పంపకంలో అన్యాయం జరిగిందని భావిస్తున్నారు.
BDK: అశ్వాపురం మండల పరిధిలో మల్లెలమడుగు గ్రామ పంచాయతీలో సుమారు 25 లక్షలతో నిర్మితమవుతున్న బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శనివారం సర్పంచ్ నరసింహారావు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ధన్యవాదాలు తెలిపారు. గత కొన్నిళ్ళుగా బ్రిడ్జి లేకపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని సమస్య తెలిపిన వెంటనే ఎమ్మెల్యే నిధులు మంజూరు చేశారని తెలిపారు.
MNCL: ప్రజాస్వామ్యాన్ని క్యాతనపల్లి కౌన్సిలర్లు కాపాడారని MLA గంగుల కమలాకర్ అన్నారు. మంత్రి వివేక్ ప్రజాస్వామ్యన్ని కాపాడాలని, ప్రజల తీర్పును గౌరవించాలని సూచించారు. పోలీసులను పెట్టి అడ్డుకుంటే సహించమని హెచ్చరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా మంత్రి వివేక్ చూడాలన్నారు. నేడు బీఆర్‌ఎస్ డే అని, క్యాతనపల్లి మున్సిపాలిటీ గెలుచుకుంటామని కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు.
SRCL: సెస్ లైసెన్స్ ముగియడంతో ఎన్పీడీసీఎల్ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. దీంతో ఎన్పీడీసీఎల్ అధికారులు వినియోగదారులకు చేరువయ్యే దిశగా చర్యలు చేపట్టారు. ఎన్పీడీసీఎల్ అధీనంలోకి వెళ్లిన మూడు రోజుల్లోనే రూ.10 కోట్ల విలువైన సామగ్రి పెద్దూర్లోని సెస్ స్టోర్ రూమ్‌కు చేరుకుంది. 110 ట్రాన్స్ ఫార్మర్లతో పాటు సామగ్రి, సిబ్బంది రక్షణకు అవసరమైన కిట్లను అందుబాటులో ఉంచారు.
NGKL: సలేశ్వరం జాతర సందర్భంగా భక్తుల రాకపోకలతో ఏర్పడిన ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను తొలగించేందుకు అటవీ శాఖ అధికారులు విస్తృత స్థాయిలో శుభ్రత చర్యలు చేపట్టారు. దాదాపు 170 మంది గిరిజన వాలంటీర్లను నియమించి అడవి ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాన్ని క్రమబద్ధంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేక బృందాలుగా విభజించి చెత్త సేకరణ పనులను కొనసాగిస్తున్నారు.
KMM: కామేపల్లి మండలం తాళ్ల గూడెం గ్రామంలో సీసీ రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ సునీత, ఉప సర్పంచ్ శ్రీనివాసరావు శనివారం ప్రారంభించారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదేశానుసారం మంజూరు అయిన నిధులతో ఈ పనులు ప్రారంభించినట్లు సర్పంచ్ తెలిపారు. ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని అన్నారు.
BHNG: జిల్లాలో యాసంగి వరి కోతలు ఊపందుకున్నాయి. కల్లాలు లేకపోవడంతో రైతులు రహదారులపైనే ధాన్యం ఆరబోస్తున్నారు. జిల్లాలో 6.20 లక్షల ఎకరాల్లో సాగైన వరిలో ఇప్పటికే సగం కోతలు పూర్తయ్యాయి. రైతులు రోడ్లపై కుప్పలుగా ధాన్యం పోసి వాటి చుట్టూ రక్షణగా బండరాళ్లు పెడుతున్నారు. దీంతో రాత్రి వేళల్లో ఇవి సరిగ్గా కనిపించక ప్రయాణికులు తీవ్ర ప్రమాదాల బారిన పడుతున్నారు.
ADB: ప్రభుత్వ అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని BRS పార్టీ జిల్లాధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తమను వెళ్లకుండా అరెస్టు చేయడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మాజీ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు.
WGL: వరంగల్ నగరంలోని భద్రకాళి ఆలయంలో ఇవాళ వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వర్దన్నపేట మున్సిపల్ పట్టణ, మండల నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి బొకే అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కౌన్సిలర్లు సిలివేరు కుమారస్వామి యాదవ్, గుజ్జ వీరన్న, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
HNK: హన్మకొండ పబ్లిక్ గార్డెన్స్‌లో రాష్ట్ర హజ్ కమిటీ సహకారంతో వరంగల్ హజ్ సొసైటీ కమిటీ ఆధ్వర్యంలో హజ్ యాత్రికులకు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే నాగరాజు హాజరై యాత్రికులకు సూచనలు, సలహాలు అందించారు. హజ్ యాత్ర పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రయాణమని పేర్కొంటూ, నియమ నిబంధనలు పాటించడం, పరస్పర సహకారం,సహనం, క్రమశిక్షణతో యాత్రను పూర్తి చేయాలన్నారు.