• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

వ్యభిచార గృహంపై పోలీసులు దాడి

MBNR: జిల్లా కేంద్రంలో వ్యభిచార ముఠా గుట్టును టూ టౌన్ పోలీసులు రట్టు చేశారు. అశోక్ టాకీస్ చౌరస్తాలోని శ్రీ సాయి బాలాజీ టవర్స్‌, ఫ్లాట్ నంబర్ 309లో సాగుతున్న ఈ వ్యవహారంపై బుధవారం ఆకస్మిక దాడి చేశారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

April 1, 2026 / 07:38 PM IST

యాదవ సంఘం కార్యదర్శిగా భాషవేని తిరుపతి

KNR: యాదవ చైతన్య వేదిక రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా సైదాపూర్ మండలానికి చెందిన భాషవేని తిరుపతిని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు గొర్ల ఐలేష్ యాదవ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో కార్యదర్శిగా నియమించినందుకు రాష్ట్ర సంఘానికి కృతజ్ఞతలు తెలిపారు. యాదవుల సంఘం బలోపేతానికి కృషి చేస్తానన్నారు.

April 1, 2026 / 07:32 PM IST

నార్నూరులో పర్యటించిన కేంద్ర ISO బృందం

ADB: నార్నూర్ మండల కేంద్రంలో బుధవారం కేంద్ర ISO బృందం పర్యటించింది. ఈ సందర్బంగా వివిధ శాఖల మండల అధికారులు, అంగన్వాడీ టీచర్లు, నూతన పాలకవర్గంతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనుల రికార్డులను పరిశీలించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో DLPO ప్రభాకర్, ఎంపీడీవో గంగాసింగ్, ఎంపీవో మహేష్, సర్పంచ్ బానోత్ కావేరి ఉన్నారు.

April 1, 2026 / 07:32 PM IST

గూడెం.. దమ్ముంటే గుట్ట మీదికి రా: కాటా

SRD: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిపై కాటా శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. “ఎమ్మెల్యే అని విర్రవీగవద్దు.. దమ్ముంటే బీరంగూడ గుట్టపైకి రావాలి, అక్కడ నీ అవినీతి చిట్టా విప్పుతా” అని సవాల్ విసిరారు. అసెంబ్లీలో హరీష్ రావు తీరుపై కూడా విమర్శలు చేశారు. నీ సంగతి చూస్తానంటూ ఎమ్మెల్యేకు బహిరంగ హెచ్చరిక జారీ చేశారు. ఈ సవాల్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.

April 1, 2026 / 07:30 PM IST

సామాజిక సమానత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్

కామారెడ్డి జిల్లా నర్సంపల్లిలో కుల వివక్ష నిర్మూలన లక్ష్యంగా సమగ్ర సామాజిక సమానత్వ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. దేవాలయాల్లో దళితులకు ప్రవేశం కల్పించడం, సహపంక్తి భోజనాలు నిర్వహించడం ద్వారా సమానత్వానికి బలమైన సందేశం ఇచ్చారు.

April 1, 2026 / 07:30 PM IST

సబ్సిడీ యంత్రాలను అందించిన ఎమ్మెల్యే

GDWL: వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద గట్టు, గద్వాల మండలాలకు చెందిన 16 మంది రైతులకు సబ్సిడీ యంత్రాలను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బుధవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పనిముట్లు, ఉచిత విద్యుత్ అందించి రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా కృషి చేశామన్నారు. భవిష్యత్తులోనూ సాంకేతికతను అందిపుచ్చుకుని రైతులు ఆర్థికంగా ఎదగాలని అన్నారు.

April 1, 2026 / 07:30 PM IST

అమిత్ షా వ్యాఖ్యలపై మల్లు రవి ఫైర్

NGKL: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కమ్యూనిస్టు పార్టీలకు, మావోయిస్టులకు మధ్య ఉన్న తేడా తెలియని పరిస్థితి నెలకొందని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడు బుల్లెట్‌ను నమ్మలేదని బ్యాలెట్‌ను నమ్మిందని అన్నారు.

April 1, 2026 / 07:30 PM IST

హనుమాన్ మందిరంలో ఘనంగా వేడుకలు

SRCL: వీర్నపల్లి మండలంలోని అడవిపదిర గ్రామ హనుమాన్ ఆలయంలో ఘనంగా పదవ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఉదయం 9:30 గంటలకు కుంకుమ పూజలో మహిళలు పెద్ద ఎత్తున్న పాల్గొన్నారు. 12:30 గంటలకు యజ్ఞం,1:00 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 6:00 గంటలకు ప్రధాన వీధుల్లో ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

April 1, 2026 / 07:27 PM IST

‘ఇందిరమ్మ ఇల్లు పథకం పేదలకు ఒక వరం’

JGL: ప్రభుత్వం పేదలకు గూడు కల్పించాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదలకు ఒక వరమని ఏఎంసీ ఛైర్మన్ బుర్ర రాములు గౌడ్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని బైర లక్ష్మి రాజయ్య దంపతులు ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంజూరైన ఇల్లు పూర్తి చేసుకుని గృహప్రవేశంలో సర్పంచ్ ఒరుగుల అరుణ శ్రీనివాస్‌తో కలిసి ఏఎంసీ ఛైర్మన్ ప్రారంభించారు.

April 1, 2026 / 07:26 PM IST

సర్పంచ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం

KMM: వేంసూరు మండల మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం మహమ్మద్ ఫక్రుద్దీన్ అలీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు గ్రామపంచాయతీలో కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్ళు కంటి చుక్కలు అందజేశారు. అలాగే శాస్త్ర చికిత్స అవసరమైన రోగులను ఖమ్మంకు తరలించి, ఉచిత ఆపరేషన్లకు ఏర్పాటు చేశారు.

April 1, 2026 / 07:25 PM IST

శ్రమ దోపిడీపై సమరశీల పోరాటాలకు సిద్ధం కండి: AITUC

SRPT: శ్రమకు తగ్గ ఫలితం దక్కడం లేదని, కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ (AITUC) రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మఠంపల్లి మండల కేంద్రంలోని ఉర్దూ మీడియం స్కూల్ ఆవరణలో జరిగిన ఏఐటీయూసీ మండల మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

April 1, 2026 / 07:25 PM IST

విద్యుత్ కోత.. రైతన్న గోస..!

VKB: ధారూర్ మండలంలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారడంతో రబీ సీజన్‌లో సాగు చేసిన పంటలు ఎండుముఖం పడుతున్నాయి. నాగసమందర్ సబ్స్టేషన్ పరిధిలోని బోరు బావులకు సరైన విద్యుత్ అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లో-వోల్టేజీ సమస్య కారణంగా బోర్ మోటార్లు తరచూ రిపేరుకు వస్తున్నాయని, దీనివల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.

April 1, 2026 / 07:23 PM IST

మృతురాలి చిత్రపటానికి మాజీ మంత్రి నివాళి

MHBD: తొర్రూరు మండలంలోని మాటేడు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ దీకొండ బిక్షపతి మాతృమూర్తి దీకొండ బుచ్చమ్మ అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మృతురాలి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

April 1, 2026 / 07:20 PM IST

క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు 80 మంది ఎంపిక

BDK: ఉమ్మడి జిల్లా గిరిజన క్రీడా పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలకు ఎంపికలు పూర్తయ్యాయి. కిన్నెరసాని, కచేనపల్లి మైదానాల్లో నిర్వహించిన బ్యాటరీ టెస్టుల ద్వారా మొత్తం 80 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు ఐటీడీఏ పీవో బి.రాహుల్ బుధవారం తెలిపారు. 105 మంది బాలుర నుంచి 40 మందిని, 72 మంది బాలికల నుంచి 40 మందిని ఎంపిక చేసి ప్రవేశాలు కల్పించారు.

April 1, 2026 / 07:20 PM IST

ఆన్‌లైన్ బుకింగ్ సర్వీస్ ప్రారంభించిన కలెక్టర్

ASF: ఇసుక సరఫరా పారదర్శకంగా జరిగేందుకు రూపొందించిన ‘మన ఇసుక వాహనం’ ఆన్‌లైన్ బుకింగ్ సర్వీస్‌ను బుధవారం కలెక్టర్ హరిత ఆసిఫాబాద్ MRO కార్యాలయంలో ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నేటి నుంచి ఈ సర్వీస్ అమల్లోకి వస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ ఆన్‌లైన్ సర్వీస్ వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో కూపన్లను ఎక్కడ జారీ చేయవద్దని కలెక్టర్ సూచించారు.

April 1, 2026 / 07:19 PM IST